క్రికెటర్లు పెట్రోల్ పోస్తే పరిగెత్తరు.. రవిశాస్త్రి స్ట్రాంగ్ వార్నింగ్

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల క్రికెట్ బోర్డులు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని టీమిండియా అవుట్‌గోయింగ్ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా హెచ్చరించాడు. క్రికెటర్ల మానసిక అలసటను గుర్తించకపోతే అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి వైదొలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పెట్రోల్‌ పోస్తే పరిగెత్తేవారు క్రికెటర్లు కాదని, వాళ్లు మనుషులు అంటూ గుర్తు చేస్తూ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు. గత ఆరు నెలలుగా బయో-సెక్యూర్ బబుల్‌లో ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లు మానసిక, శారీరక ఒత్తిడికి లోనయ్యారని […]

Update: 2021-11-08 21:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల క్రికెట్ బోర్డులు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని టీమిండియా అవుట్‌గోయింగ్ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా హెచ్చరించాడు. క్రికెటర్ల మానసిక అలసటను గుర్తించకపోతే అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి వైదొలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పెట్రోల్‌ పోస్తే పరిగెత్తేవారు క్రికెటర్లు కాదని, వాళ్లు మనుషులు అంటూ గుర్తు చేస్తూ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు.

గత ఆరు నెలలుగా బయో-సెక్యూర్ బబుల్‌లో ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లు మానసిక, శారీరక ఒత్తిడికి లోనయ్యారని గుర్తు చేశారు. అందుకే టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశకు అర్హత సాధించలేదని చెప్పుకొచ్చాడు. నమీబియా జట్టుపై 9 వికెట్ల పరుగుల తేడాతో భారత్ గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రవి శాస్త్రి టీమిండియాపై ప్రశంసలు చేస్తూనే.. క్రికెట్ బోర్డులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత భారత జట్టు “విజేత జట్టు”.. కానీ, ఆటగాళ్ల మానసిక క్షేమం పట్ల బోర్డుకు శ్రద్ధ లేకపోవడంతో జట్టు పురోగతికి ఆటంకం కలిగింది’. ఈ నేపథ్యంలోనే అన్ని క్రికెట్ బోర్డులు, ICC వారు ఆటగాళ్ల మానసిక అలసటను ఎలా నిర్వహించబోతున్నారనే దాని గురించి ఆలోచించాలని రవి శాస్త్రి సూచించారు. క్రికెటర్లకు సమయం ఇచ్చిన తర్వాతనే సిరీస్‌లు ఆడించాలన్నారు. ముఖ్యంగా బయో-బబుల్ వాతావరణంలో ఆటగాళ్లకు తగు విశ్రాంతి అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బ్యాన్‌ఐపీఎల్.. బీసీసీఐ ముందు నెటిజన్ల సంచలన డిమాండ్

Tags:    

Similar News