రేషన్ డీలర్లకు 30వేల జీతం, 250 రూపాయల కమీషన్ ఇవ్వాలి..

దిశ, మహేశ్వరం : రేషన్ డీలర్లకు 30 వేల వేతనంతో పాటు, క్వింటాలకు 250 రూపాయలు కమీషన్ ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మహేశ్వరం తహశీల్దార్ జ్యోతికి రేషన్ డీలర్లు వేతనాలు పెంచాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు 20 లక్షల జీవిత బీమాతో పాటు, కరోనా బారిన పడిన రేషన్ డీలర్లకు 25 […]

Update: 2021-07-06 06:58 GMT

దిశ, మహేశ్వరం : రేషన్ డీలర్లకు 30 వేల వేతనంతో పాటు, క్వింటాలకు 250 రూపాయలు కమీషన్ ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మహేశ్వరం తహశీల్దార్ జ్యోతికి రేషన్ డీలర్లు వేతనాలు పెంచాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు 20 లక్షల జీవిత బీమాతో పాటు, కరోనా బారిన పడిన రేషన్ డీలర్లకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ప్రభుత్వం రేషన్ దుకాణాలకు ఉచిత కరెంట్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్ సూర్య, మండల అధ్యక్షుడు ఎం.ఏ సత్తార్, గన్నబోయిన శివ యాదవ్, దోమ వెంకటరమణ రెడ్డి, కృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, సందీప్, ఆప్సరి బేగం తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News