ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి.. రోడ్డు బ్లాక్ చేసిన రైతులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గోపాల్ పేట్ గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 498 అసైన్డ్ భూముల కబ్జాలను, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కామారెడ్డి -ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తుల ఆందోళనకు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు మద్దతు పలికారు. గోపాల్ పేట్‌లో అసైన్డ్ భూములను అక్రమంగా కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించారని, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గోపాల్ పేట్ గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 498 అసైన్డ్ భూముల కబ్జాలను, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కామారెడ్డి -ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తుల ఆందోళనకు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు మద్దతు పలికారు. గోపాల్ పేట్‌లో అసైన్డ్ భూములను అక్రమంగా కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించారని, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గంట పాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.