ఆ రోజు ఇంకా గుర్తుంది : రష్మిక
క్యూట్ రష్మిక ఫ్టస్ట్ మ్యాగజైన్ రష్మిక మందన్న.. లాక్ డౌన్ పీరియడ్‌లో తన ఫ్యామిలీ గురించి మస్త్ విషయాలను షేర్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా తన ఆలోచనలను అభిమానులతో పంచుకున్న ఈ భామ.. తాజాగా తన మొట్టమొదటి కవర్ పేజ్‌ను షేర్ చేస్తూ చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయింది. ఐదేళ్ల వయస్సులో (2001) మ్యాగజైన్ కవర్ పేజీపై రెండు చేతులకు వాచ్ పెట్టుకుని, క్యూట్ స్మైల్‌తో కనిపిస్తున్న రష్మిక.. ఆ రోజు షూట్ చేయడం నాకు […]
క్యూట్ రష్మిక ఫ్టస్ట్ మ్యాగజైన్
రష్మిక మందన్న.. లాక్ డౌన్ పీరియడ్‌లో తన ఫ్యామిలీ గురించి మస్త్ విషయాలను షేర్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా తన ఆలోచనలను అభిమానులతో పంచుకున్న ఈ భామ.. తాజాగా తన మొట్టమొదటి కవర్ పేజ్‌ను షేర్ చేస్తూ చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయింది. ఐదేళ్ల వయస్సులో (2001) మ్యాగజైన్ కవర్ పేజీపై రెండు చేతులకు వాచ్ పెట్టుకుని, క్యూట్ స్మైల్‌తో కనిపిస్తున్న రష్మిక.. ఆ రోజు షూట్ చేయడం నాకు ఇప్పటికీ గుర్తుందని చెబుతోంది. మా అమ్మ ఈ మ్యాగజైన్ దాచిపెట్టి ఇప్పుడు చూపించిందని.. ఇప్పటికీ నా ప్రతీ మ్యాగజైన్‌ను సేవ్ చేస్తుందని వెల్లడించింది. మీ ప్రేమను పొందుతూ ఈ రోజు నేనిలా నిల్చున్నానంటే నిజంగా ఆశ్చర్యపోతున్నానని చెప్పింది. ‘నా కుటుంబాన్ని, స్నేహితులను, నా జీవితంలో జరిగిన విషయాలను, నేను కలిసి వర్క్ చేసిన.. చేస్తున్న వారిని, పోరాడిన ప్రతీ యుద్ధాన్ని, చేరుకున్న ప్రతీ మైలురాయిని ప్రేమిస్తున్నానని’ తెలిపింది రష్మిక. ఇక ఈ పిక్చర్ చూసిన అభిమానులు.. అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం మార్పులేదు, అంతే క్యూట్‌గా ఉన్నారని కాంప్లిమెంట్ ఇస్తున్నారు.
కాగా తెలుగులో ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ లాంటి సూపర్ హిట్స్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది.