Rashmika Mandanna : పెళ్లి చేసుకోబోయే వ్యక్తిపై నటి ‘రష్మిక’ ఆస్తక్తికర వ్యాఖ్యలు..

దిశ, సినిమా : టాలీవుడ్‌లో ‘గీతాగోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందాన.. తన లేటెస్ట్ స్టేట్‌మెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్‌పై రూమర్స్ స్ర్పెడ్ అవుతున్న నేపథ్యంలో తనకు తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పడం పట్ల ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇటీవలే కార్తి హీరోగా నటించిన ‘సుల్తాన్’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. తమిళనాడు కల్చర్‌ తనను బాగా అట్రాక్ట్ చేసిందని […]

Update: 2021-05-16 05:52 GMT

దిశ, సినిమా : టాలీవుడ్‌లో ‘గీతాగోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందాన.. తన లేటెస్ట్ స్టేట్‌మెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్‌పై రూమర్స్ స్ర్పెడ్ అవుతున్న నేపథ్యంలో తనకు తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పడం పట్ల ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇటీవలే కార్తి హీరోగా నటించిన ‘సుల్తాన్’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. తమిళనాడు కల్చర్‌ తనను బాగా అట్రాక్ట్ చేసిందని తెలిపింది.

తమిళ్ టేస్టీ ఫుడ్‌తో ప్రేమలో పడిపోయానని.. కుదిరితే ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకుని తమిళనాడు కోడలిని అయిపోతానని మీడియాతో తన రీసెంట్ ఇంటరాక్షన్‌లో వెల్లడించింది. ఇక తనపై ప్రేమ కురిపిస్తూ, మద్దతుగా నిలుస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో కృతజ్ఞతలు తెలిపింది. మరి రష్మిక కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

 

Tags:    

Similar News