గర్భందాల్చిన మైనర్.. ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుజూసింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బోధన్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటోన్న ఆటో డ్రైవర్ ఎజాజ్, అదే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు. మాయమాటలతో లొంగదీసుకొని బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు బాలిక ఆరు నెలల గర్భంతో ఉందని […]

Update: 2021-10-16 08:30 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుజూసింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బోధన్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటోన్న ఆటో డ్రైవర్ ఎజాజ్, అదే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు. మాయమాటలతో లొంగదీసుకొని బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు బాలిక ఆరు నెలల గర్భంతో ఉందని నిర్ధారించారు.

దీంతో బాలికను తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో ఎజాజ్ అనే ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన విషయాన్ని బయటపెట్టింది. బాలిక ఫిర్యాదు మేరకు ఎజాజ్‌పై నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ నగరంలో గత నెల రోజుల కాలంలో నాలుగు రేప్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ఒక యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన మరువక ముందే మరో ఇద్దరు చిన్నారులపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనతో మొత్తం నిజామాబాద్ నగరంలో నాలుగు రేప్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News