అత్యాచారం కేసు.. పంజాగుట్ట నుంచి సీసీఎస్‌కు బదిలీ
దిశ, క్రైమ్‌బ్యూరో: 139మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేసిన కేసును పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ నుంచి సీసీఎస్‌కు బదిలీ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 25ఏళ్ల యువతి ఈనెల 20న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది. కేసు విచారణలో భాగంగా ముందుగా భరోసా కేంద్రానికి తీసుకెళ్లి ఆ యువతి స్టేట్మెంట్‌ను మూడ్రోజులు రికార్డు చేశారు. ఈ కేసులో ప్రముఖ రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారి పేర్లు కూడా […]
దిశ, క్రైమ్‌బ్యూరో: 139మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేసిన కేసును పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ నుంచి సీసీఎస్‌కు బదిలీ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 25ఏళ్ల యువతి ఈనెల 20న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది. కేసు విచారణలో భాగంగా ముందుగా భరోసా కేంద్రానికి తీసుకెళ్లి ఆ యువతి స్టేట్మెంట్‌ను మూడ్రోజులు రికార్డు చేశారు. ఈ కేసులో ప్రముఖ రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారి పేర్లు కూడా ఎఫ్ఐఆర్‌లో నమోదు కావడంతో దర్యాప్తును ఎలా ప్రారంభించాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్‌కు బదిలీ చేసినట్టు పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు. సీసీఎస్ ఉమెన్ పీఎస్ ఏసీపీ శ్రీదేవి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు.