ఒంగోలు రిమ్స్‌లో కీచకపర్వం.. రోగుల కళ్లెదుటే బెడ్ మీద నర్సుపై..!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మరో కీచకపర్వం శుక్రవారం వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకపోయిన ఓ రోగి బంధువు అందరూ చూస్తుండగానే నర్సుపై లైంగికదాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది, రోగుల బంధువులు నర్సును కీచకుడి చెర నుంచి రక్షించారు. ముందుగా రోగి ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చిన నర్సును ఆ వ్యక్తి వెనుక నుంచి అసభ్యంగా తాకాడు. అది గుర్తించిన ఆమె వెంటనే ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన కామాంధుడు ఆమెను లాగి బెడ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మరో కీచకపర్వం శుక్రవారం వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకపోయిన ఓ రోగి బంధువు అందరూ చూస్తుండగానే నర్సుపై లైంగికదాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది, రోగుల బంధువులు నర్సును కీచకుడి చెర నుంచి రక్షించారు.
ముందుగా రోగి ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చిన నర్సును ఆ వ్యక్తి వెనుక నుంచి అసభ్యంగా తాకాడు. అది గుర్తించిన ఆమె వెంటనే ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన కామాంధుడు ఆమెను లాగి బెడ్ మీద పడేసి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ వ్యవహారం అంతటిని చికిత్స పొందుతున్న రోగులు కళ్లారా చూశారు. అనంతరం రిమ్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బాధిత నర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.