కోర్టు సంచలన తీర్పు.. గద్వాల్‌లో అత్యాచార నిందితుడికి 10ఏళ్ల జైలు శిక్ష
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఎంవీ పౌండేషన్ పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినిపై స్కూల్ వాచ్‌మెన్ పాతూరు కర్రెన్న అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ కేసుపై మంగళవారం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జీ సంతోష్ కుమార్ విచారణ జరిపారు. విచారణ అనంతరం సంతోష్ కుమార్ తీర్పును వెల్లడించారు. అత్యాచారానికి పాల్పడిన వాచ్‌మెన్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, మూడు వేల […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఎంవీ పౌండేషన్ పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినిపై స్కూల్ వాచ్‌మెన్ పాతూరు కర్రెన్న అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ కేసుపై మంగళవారం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జీ సంతోష్ కుమార్ విచారణ జరిపారు.
విచారణ అనంతరం సంతోష్ కుమార్ తీర్పును వెల్లడించారు. అత్యాచారానికి పాల్పడిన వాచ్‌మెన్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, మూడు వేల రూపాయలు జరిమానా విధిస్తున్నట్టు తీర్పునిచ్చారు. అయితే.. 2017లో మైనర్‌పై అత్యాచారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని అప్పటి సీఐ జె. వెంకటేశ్వరరావు విచారణ అధికారిగా వ్యవహరించి వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు.
ఈ వివరాలతో పాటు పలువురు సాక్షుల నుంచి మరిన్ని వివరాలను సేకరించి పాతూరు కర్రెన్నను దోషిగా నిర్ధారించారు. అనంతరం శిక్షను ఖరారు చేశారు. ఈ సందర్బంగా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అప్పటి సీఐ వెంకటేశ్వరరావు, ప్రస్తుత సీఐ వెంకటేశ్వర్లు, అప్పటి ఎస్ఐ రమేష్, మహబూబ్ నగర్ కోర్టు లైనింగ్ అధికారి ఏఎస్ఐ నర్సింహులు, గద్వాల కోర్టు లైనింగ్ అధికారి సాయిబాబా, కోర్టు విధుల నిర్వహణ అధికారి గౌస్ పీర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ షఫీ ఉల్లాను ప్రత్యేకంగా అభినందించారు.