ఎర్రకోటకు బీటలు వేసిన కుటుంబం.. టీఆర్ఎస్‌లోకి
దిశ, ఖమ్మం టౌన్ : రాపర్తి రంగారావు అంటే ఖమ్మం నగర ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాపర్తి ఖమ్మం మున్సిపల్ చైర్మన్‌గా పని చేశారు. సీపీఎంకు కంచుకోటగా చెప్పుకునే ఖమ్మం నగర వీధుల్లో రంగారావు తనదైన శైలితో ఎర్ర కోటకు బీటలు వేశారు. మున్సిపల్ చైర్మన్‌గా ఆయన అనేక వినూత్న సంస్కరణలకు నాంది పలికి పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. రంగారావు కొనసాగుతున్న కాలంలో ఖమ్మం నగర కాంగ్రెస్ […]
దిశ, ఖమ్మం టౌన్ : రాపర్తి రంగారావు అంటే ఖమ్మం నగర ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాపర్తి ఖమ్మం మున్సిపల్ చైర్మన్‌గా పని చేశారు. సీపీఎంకు కంచుకోటగా చెప్పుకునే ఖమ్మం నగర వీధుల్లో రంగారావు తనదైన శైలితో ఎర్ర కోటకు బీటలు వేశారు. మున్సిపల్ చైర్మన్‌గా ఆయన అనేక వినూత్న సంస్కరణలకు నాంది పలికి పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. రంగారావు కొనసాగుతున్న కాలంలో ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం బలంగా ఉండేది. అయితే, 2014లో ఆయన అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
రంగారావు మరణాంతరం రాజకీయ వారసత్వ బాధ్యతలను ఆయన కుమారుడు రాపర్తి శరత్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనలో భాగంగా.. పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్‌లోకి చేరిపోయారు. శరత్‌తో పాటు మొత్తం కుటుంబ సభ్యులు కూడా గులాజీ కండువా కప్పుకున్నారు. అనూహ్యంగా రాపర్తి కుటుంబం టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఖమ్మం నగర ప్రజల్లో సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. మరి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వీరి చేరిక అధికార పార్టీకి ఎంత మేరకు లాభాన్ని చేకూర్చుతుందో వేచి చూడాల్సిందే.