కంటెస్టెంట్ కష్టాలు విని.. తట్టుకోలేక ఏడ్చేసిన రణ్వీర్ సింగ్
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్మాల్ స్క్రీన్‌పై కూడా సత్తా చాటుతున్నాడు. ‘ది బిగ్ పిక్చర్’ క్విజ్ షోతో హోస్ట్ అవతారమెత్తిన రణ్వీర్.. జస్ట్ హీరోగా మాత్రమే కాదు హోస్టింగ్‌లోనూ తన స్టైలే వేరు అనిపించాడు. శని, ఆదివారం కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రామ్ ద్వారా బెస్ట్ అనిపించుకున్న స్టైల్ ఐకాన్.. లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రోమోలో కన్నీరు పెట్టుకున్నాడు. కంటెస్టెంట్ తన లైఫ్ స్ట్రగుల్స్ గురించి వివరిస్తుండగా ఏడ్చేశాడు. చిన్నవయసులోనే తండ్రిని […]
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్మాల్ స్క్రీన్‌పై కూడా సత్తా చాటుతున్నాడు. ‘ది బిగ్ పిక్చర్’ క్విజ్ షోతో హోస్ట్ అవతారమెత్తిన రణ్వీర్.. జస్ట్ హీరోగా మాత్రమే కాదు హోస్టింగ్‌లోనూ తన స్టైలే వేరు అనిపించాడు. శని, ఆదివారం కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రామ్ ద్వారా బెస్ట్ అనిపించుకున్న స్టైల్ ఐకాన్.. లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రోమోలో కన్నీరు పెట్టుకున్నాడు. కంటెస్టెంట్ తన లైఫ్ స్ట్రగుల్స్ గురించి వివరిస్తుండగా ఏడ్చేశాడు. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన తనకు ఆ పెయిన్, ఫీల్ ఎలా ఉంటుందో తెలియలేదని.. ముగ్గురు పిల్లలను పెంచేందుకు అమ్మ చాలా కష్టపడిందని వివరించాడు. ఈ కష్టాలను విని తట్టుకోలేకపోయిన రణ్వీర్.. ఏడవడమే కాదు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చాడు. ఇక మరో ప్రోమోలో రణ్‌వీర్‌కు లేడీ కంటెస్టెంట్ తలపాగాను బహుమతిగా అందించి, గూమర్ డ్యాన్స్ నేర్పించింది.