టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటుతాం: రాణీ రాంపాల్

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తామని భారత హాకీ మహిళా జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ ధీమా వ్యక్తం చేశారు. పతకం సాధించే సత్తా భారత జట్టుకు ఉందని, 2021 ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శన చేస్తామని చెప్పారు. ఇటీవల ఎఫ్ఐహెచ్ సిరీస్ గెలిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ హాకీ షెడ్యూల్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది జూలై 23న భారత మహిళా జట్టు తొలి మ్యాచ్ […]

Update: 2020-07-24 07:40 GMT

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తామని భారత హాకీ మహిళా జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ ధీమా వ్యక్తం చేశారు. పతకం సాధించే సత్తా భారత జట్టుకు ఉందని, 2021 ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శన చేస్తామని చెప్పారు. ఇటీవల ఎఫ్ఐహెచ్ సిరీస్ గెలిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ హాకీ షెడ్యూల్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది జూలై 23న భారత మహిళా జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రాణీ రాంపాల్ స్పందిస్తూ ఇటీవల కఠినమైన జట్లతో తలపడి గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించామని, ఈ ప్రదర్శనను మెగా టోర్నీలో కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఒక్కో టోర్నీ నుంచి మా జట్టు నేర్చుకుంటూ మరింత మెరుగవుతుందని, ఒలింపిక్స్‌కు మరో ఏడాది సమయం ఉండటంతో ప్రాక్టీస్‌కు సమయం దొరికిందన్నారు.

Tags:    

Similar News