ఆర్జీవీ బయోపిక్.. ‘రాము’ ఫస్ట్ లుక్

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ అంటేనే ప్రాక్టికల్. ప్రతీ విషయంలో ప్రాక్టికల్‌గానే ఆలోచిస్తాడు. ఎవ్వరు ఏం అనుకున్నా సరే, తను చెప్పాలనుకున్నది.. చేయాలనుకున్నది చేసేస్తాడు. నిజం చెప్పాలంటే ఆయనలా జీవించాలని ఆశపడే వ్యక్తులు చాలా మందే ఉంటారు. కానీ అది ఆర్జీవీకి మాత్రమే సాధ్యమనేది సత్యం. ‘శివ’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తీసినా.. థ్రిల్లర్ లాంటి బోల్డ్ ఫిల్మ్ తీసినా.. ఆర్జీవీ చెప్పేది ఒక్కటే! ఒక వయసులో ఉన్న మైండ్ సెట్.. కాలం మారే […]

Update: 2020-08-26 07:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ అంటేనే ప్రాక్టికల్. ప్రతీ విషయంలో ప్రాక్టికల్‌గానే ఆలోచిస్తాడు. ఎవ్వరు ఏం అనుకున్నా సరే, తను చెప్పాలనుకున్నది.. చేయాలనుకున్నది చేసేస్తాడు. నిజం చెప్పాలంటే ఆయనలా జీవించాలని ఆశపడే వ్యక్తులు చాలా మందే ఉంటారు. కానీ అది ఆర్జీవీకి మాత్రమే సాధ్యమనేది సత్యం. ‘శివ’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తీసినా.. థ్రిల్లర్ లాంటి బోల్డ్ ఫిల్మ్ తీసినా.. ఆర్జీవీ చెప్పేది ఒక్కటే! ఒక వయసులో ఉన్న మైండ్ సెట్.. కాలం మారే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ పూర్తిగా మారిపోతూ వస్తుందని.. అందుకే ‘శివ’ లాంటి ట్రెండ్ సెట్టర్ మూవీని ఇప్పుడు తీయలేనని.. నా వల్ల ఇలాంటి వివాదాస్పద చిత్రాలే సాధ్యమవుతాయని నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటాడు.

అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ‘న భూతో న భవిష్యత్’ అనిపిస్తుంది ఒక్కోసారి. అందుకే తన జీవిత కథను సినిమా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు దొరసాయి తేజ. ఆర్జీవీ బయోపిక్‌ను మూడు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు. బొమ్మాకు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న మూవీ పార్ట్-1కు ‘రాము’ టైటిల్ ఖరారు కాగా.. బయోపిక్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ అనేది క్యాప్షన్. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. సినిమాకు రచయితగా, సూపర్‌వైజర్‌గా వర్క్ చేస్తున్నారు వర్మ.

కాగా పార్ట్-1లో ఆర్జీవీ కాలేజీ రోజులు, ఫస్ట్ లవ్, విజయవాడలో గ్యాంగ్ ఫైట్స్‌తో పాటు ‘శివ’ సినిమా చేసేందుకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది చూపించబోతున్నాడు.

ఇక పార్ట్-2ను రామ్ గోపాల్ వర్మ టైటిల్‌తో తెరకెక్కించనుండగా.. అండర్ వరల్డ్‌‌తో ప్రేమాయణం అనేది క్యాప్షన్. ఇందులో ఆర్జీవీ ముంబై లైఫ్‌లో అమ్మాయిలు, గ్యాంగ్‌స్టర్స్, అమితాబ్ బచ్చన్‌తో అనుబంధం గురించి తెరపై చూపించబోతున్నాడు డైరెక్టర్.

పార్ట్-3కి ‘ఆర్జీవీ’ టైటిల్ కాగా.. ది ఇంటెలిజెంట్ ఇడియట్ అనేది క్యాప్షన్. ఇందులో రామ్ ఫెయిల్యూర్స్, వివాదాలు, దేవుళ్ళు, సెక్స్, సమాజం పట్ల తనకున్న విపరీత వైఖరుల గురించి ప్రజెంట్ చేయబోతున్నారు.

Tags:    

Similar News