Allu Arjunపై కేసులో సంచలన అప్‌డేట్.. కీలక తీర్పిచ్చిన కోర్టు

Update: 2024-11-06 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టులో స్టార్ హీరో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ నంద్యాల పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌‌ను క్వాష్ చేయాలని హైకోర్ట్‌ ఈ రోజు (బుధవారం) ఆదేశించింది. కాగా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు. ఆయన ఫిర్యాదుతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక తాజాగా ఈ కేసును కొట్టేయాలంటూ అల్లుఅర్జున్ కోర్టుకి ఎక్కగా.. విచారణ జరిపిన ధర్మాసనం కేసును క్వాష్ చేస్తున్నట్లు తీర్పునిచ్చింది. 


Similar News