false case : 'ఫాల్స్ కేసు నమోదు చేసిన సీఐ, ఎస్సైల పై చర్యలు తీసుకోవాలి...'
ఫాల్స్ కేసు నమోదు చేసిన సీఐ ఎం.ప్రవీణ్ కుమార్, ఎస్ఐ బి.విక్రమ్ ల పై చర్యలు తీసుకోవాలని బాధితుడు సి.శేఖర్ మంగళవారం నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
దిశ, భైంసా : ఫాల్స్ కేసు నమోదు చేసిన సీఐ ఎం.ప్రవీణ్ కుమార్, ఎస్ఐ బి.విక్రమ్ ల పై చర్యలు తీసుకోవాలని బాధితుడు సి.శేఖర్ మంగళవారం నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫాల్స్ కేసు నమోదు చేయడంతో ఉద్యోగంలో ఉన్న తనకు ప్రొబిషన్ పీరియడ్ కాలానికి ఇబ్బంది అవ్వడమే కాకుండా ఇంక్రిమెంట్ ఆగిపోయిందని, దీంతో మానసికంగా ఎంతో కృంగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇల్లీగల్ గా పాల్స్ కేసు నమోదు చేసిన సీఐ, ఎస్సైల పై జిల్లా ఎస్పీ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.