ఎంపీలుగా రామిరెడ్డి, పిల్లి సుభాష్, మోపిదేవి ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ : నూతనంగా ఎంపికైన రాజ్యసభ సభ్యుల చేత నేడు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా వైఎస్సీఆర్ సీపీ నేతలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తదనంతరం మిగతా రాష్ట్రాల నుంచి ఎన్నిక సభ్యులతో చైర్మన్ ప్రమాణస్వీకరం చేయించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజ్యసభకు ఎన్నికయ్యారు. […]
న్యూఢిల్లీ : నూతనంగా ఎంపికైన రాజ్యసభ సభ్యుల చేత నేడు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా వైఎస్సీఆర్ సీపీ నేతలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తదనంతరం మిగతా రాష్ట్రాల నుంచి ఎన్నిక సభ్యులతో చైర్మన్ ప్రమాణస్వీకరం చేయించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపత్యంలో వారు ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. అయితే, నూతనంగా ఎన్నికైన మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ మాత్రం హాజరుకాలేదు. తన వ్యక్తిగత కారణాలతో ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదని తెలుస్తోంది. ఆయన మరొకరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అయితే మొత్తం 20 రాష్ట్రాల నుంచి 61 మంది సభ్యులు నూతనంగా ఎంపికైన విషయం తెలిసిందే.