139మంది అత్యాచారం కేసుపై వర్మ మూవీ !

దిశ, వెబ్‌డెస్క్: తనపై 139మంది అత్యాచారం చేశారని ఇటీవల హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఇప్పటికే తన టీమ్‌ను పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన రాబోతుందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే రెండ్రోజుల క్రితం యువతి తనపై 139మంది అత్యాచారానికి పాల్పడలేదని, అంతకు ముందు చెప్పినట్లు ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వాళ్ల […]

Update: 2020-09-01 09:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: తనపై 139మంది అత్యాచారం చేశారని ఇటీవల హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఇప్పటికే తన టీమ్‌ను పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన రాబోతుందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే రెండ్రోజుల క్రితం యువతి తనపై 139మంది అత్యాచారానికి పాల్పడలేదని, అంతకు ముందు చెప్పినట్లు ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వాళ్ల పేర్లను డాలర్ బాబు ఒత్తిడి మేరకు చెప్పినట్లు మీడియాకు తెలిపింది.

Tags:    

Similar News