ఒమిక్రాన్ వైరస్.. రామగుండం సీపీ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు
దిశ, గోదావరిఖని : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ భారతదేశంలో ప్రవేశించిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణతో పాటు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని, మాస్క్ ధరించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో, షాపింగ్ మాల్స్‌తో పాటు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ఖచ్చితంగా ధరించాలన్నారు. ఎవరైనా మాస్కు […]
దిశ, గోదావరిఖని : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ భారతదేశంలో ప్రవేశించిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణతో పాటు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని, మాస్క్ ధరించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో, షాపింగ్ మాల్స్‌తో పాటు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ఖచ్చితంగా ధరించాలన్నారు.
ఎవరైనా మాస్కు లేకుండా కనిపిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టంచేశారు. అందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ప్రతీ పట్టణం, కాలనీ, గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కొవిడ్ నుంచి మన ప్రాణాలను రక్షించుకోవాలంటే మాస్క్ తప్పనిసరి అని వెల్లడించారు.