హలీం ఆగయా.. ఇష్టంగా టేస్ట్ చేస్తున్న పీపుల్
హలీం.. అందరికీ ఇష్టమైన వంటకం. హలీం రుచి చూడాలంటే రంజాన్‌మాసం వరకు వేచిచూడాల్సిందే. రంజాన్నుకు ముందుగానే భాగ్యనగరం వీధుల్లో ఎన్నో హలీం సెంటర్లు వెలుస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ బట్టీలపై వేడివేడి హలీం ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతుంది. కేవలం రంజాన్‌మాసంలో దొరికే హలీం ప్రస్తుతం రెండు నెలల ముందుగానే లభిస్తోంది. కూకట్పల్లి రంగధాముని చెరువు కట్టపై నాయాబ్హలీం సెంటర్వెలిసింది. ముందస్తుగానే హలీం అందుబాటులోకి రావడంతో స్థానికులు ఎంతో ఇష్టంగా టేస్ట్చేస్తున్నారు. దిశ, కూకట్ పల్లి: రంజాన్ […]
హలీం.. అందరికీ ఇష్టమైన వంటకం. హలీం రుచి చూడాలంటే రంజాన్‌మాసం వరకు వేచిచూడాల్సిందే. రంజాన్నుకు ముందుగానే భాగ్యనగరం వీధుల్లో ఎన్నో హలీం సెంటర్లు వెలుస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ బట్టీలపై వేడివేడి హలీం ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతుంది. కేవలం రంజాన్‌మాసంలో దొరికే హలీం ప్రస్తుతం రెండు నెలల ముందుగానే లభిస్తోంది. కూకట్పల్లి రంగధాముని చెరువు కట్టపై నాయాబ్హలీం సెంటర్వెలిసింది. ముందస్తుగానే హలీం అందుబాటులోకి రావడంతో స్థానికులు ఎంతో ఇష్టంగా టేస్ట్చేస్తున్నారు.
దిశ, కూకట్ పల్లి: రంజాన్ మాసంలో నగరంలోని ప్రతీ కాలనీలో హలీం బట్టీలు దర్శనమిస్తాయి. కేవలం రంజాన్ మాసంలోనే ప్రత్యేకంగా అందరికీ అందుబాటులో ఉండే హలీంను రంజాన్ నెలకు రెండు నెలల ముందే కూకట్ పల్లి రంగధాముని చెరువు కట్టపై లభిస్తోంది. ఖైసర్ నగర్‌కు చెందిన జంహంగీర్ కొన్నేళ్లుగా రంగధాముని చెరువు కట్టపై ఫుడ్ స్టాల్ నిర్వహిస్తు ఉపాధి పొందుతున్నాడు. రంజాన్ నెలలో అందరూ ఇష్టపడే హలీంను తన స్టాల్ లో అందుబాటులోకి తీసుకు వచ్చాడు. రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి వరకు భోజన ప్రియులకు హలీమ్ రుచులను అందిస్తూ రంజాన్ మాసాన్ని ముందుగా గుర్తు చేస్తున్నాడు. కూకట్ పల్లిలోని నాయాబ్ హలీంస్టాల్ ను సందర్శించి అందరూ అమితంగా ఇష్టపడే హలీంను ఒకసారి టేస్ట్ చేయాల్సిందే మరి.
చాలా మంది ఇష్టపడతారు : జహంగీర్, స్టాల్ నిర్వహకుడు
కూకట్ పల్లి ప్రజలు భోజన ప్రియులు. రంజాన్ లోనే ప్రత్యేకం గా లభించే హలీంను కూకట్ పల్లి వాసులకు అందించడానికి నాయా బ్ హలీం స్టాల్ ను ఏర్పాటు చేశా. 20 రోజులుగా నిర్వహిస్తున్న హలీం స్టాల్ కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది.