Justice Sujoy Paul : తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి(HighCourt CJ)గా జస్టిస్ సుజయ్ పాల్(Justice Sujoy Paul) నియమితులయ్యారు.

Update: 2025-01-14 14:51 GMT
Justice Sujoy Paul : తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి(HighCourt CJ)గా జస్టిస్ సుజయ్ పాల్(Justice Sujoy Paul) నియమితులయ్యారు. హైకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్ సుజ‌య్‌పాల్‌కు సీజేగా బాధ్యత‌లు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటివరకు ఇక్కడ సీజేగా ఉన్న జ‌స్టిస్ ఆలోక్ అరాధే(Justice Aloke Aradhe) బాంబే హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా బ‌దిలీ అయ్యారు. 1964 జూన్ 21న జ‌న్మించిన జ‌స్టిస్ సుజ‌య్ పాల్ బీకాం, ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 1990లో మ‌ధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో పేరు న‌మోదు చేసుకున్నారు. ప‌లు బ్యాంకులు, మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్, బోర్డుల‌కు సేవ‌లందించారు. 2011 మే 27న మ‌ధ్యప్రదేశ్ హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా, 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార‌సుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తిగా బ‌దిలీ అయ్యారు. తాజాగా హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా నియమితులయ్యారు. 

Tags:    

Similar News