అదే నాకు అతిపెద్ద గిఫ్ట్ : చరణ్
కరోనా వైరస్ మూలంగా అనేక కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. పెండ్లీలు సైతం పది,ఇరవై మందితో కానిచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా తన పుట్టినరోజును ఎక్కడా చేయొద్దని అభిమానులకు పిలుపునిచ్చారు. తన పుట్టినరోజున అభిమానులు.. ఎక్కడ బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి కరోనా మహామ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చాడు చరణ్ తెలిపారు.. అంతేకాదు నిన్న రాత్రి నుంచి తనకు ఎంతో మంది సన్నిహితులు, అభిమానులు ఫోన్ చేసి అభినందలు తెలియజేసినట్టు […]
కరోనా వైరస్ మూలంగా అనేక కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. పెండ్లీలు సైతం పది,ఇరవై మందితో కానిచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా తన పుట్టినరోజును ఎక్కడా చేయొద్దని అభిమానులకు పిలుపునిచ్చారు. తన పుట్టినరోజున అభిమానులు.. ఎక్కడ బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి కరోనా మహామ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చాడు చరణ్ తెలిపారు.. అంతేకాదు నిన్న రాత్రి నుంచి తనకు ఎంతో మంది సన్నిహితులు, అభిమానులు ఫోన్ చేసి అభినందలు తెలియజేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ రోజు రామ్ చరణ్ 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా చిరంజీవి.. రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా మహామ్మారిపై పోరులో భాగంగా రామ్ చరణ్ రూ.70లక్షలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళంగా ప్రకటించారు.
Tags: Ram Charan, birthday, fans, not celebrate, coronavirus