పోలీసుల హెచ్చరికలు బేఖాతరు.. నినాదాలతో ర్యాలీ తీసిన సంఘాలు

దిశ, పరకాల : పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 25వ రోజు ఉద్యమం కొనసాగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున పరకాల పట్టణ కేంద్రంలో ఎలాంటి ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు నిర్వహించ వద్దంటూ పరకాల ఏసీపీ శివరామయ్య హెచ్చరికలు జారీ చేశారు. కానీ, జిల్లా సాధన సమితి నాయకులు అవేవి పట్టించుకోకుండా శనివారం పరకాలలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం […]

Update: 2021-08-07 02:31 GMT

దిశ, పరకాల : పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 25వ రోజు ఉద్యమం కొనసాగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున పరకాల పట్టణ కేంద్రంలో ఎలాంటి ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు నిర్వహించ వద్దంటూ పరకాల ఏసీపీ శివరామయ్య హెచ్చరికలు జారీ చేశారు.

కానీ, జిల్లా సాధన సమితి నాయకులు అవేవి పట్టించుకోకుండా శనివారం పరకాలలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌కు చేరుకొని మీ ఊరు ముద్దా..? పరకాల వద్దా..? పరకాలని జిల్లా కేంద్రంగా వెంటనే ప్రకటించాలంటూ పలు నినాదాలు చేశారు. 25వ రోజు కార్యక్రమంలో భాగంగా పరకాల పెయింటర్స్ అసోసియేషన్, కిరణ వర్తక సంఘాలు సంఘీభావం ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమంలో అమరవీరుల జిల్లా సాధన సమితి కన్వీనర్ పిట్ట వీరస్వామి, కో కన్వీనర్ మార్తా బిక్షపతి, బీజేపీ నాయకులు జయంతి లాల్, కాంగ్రెస్ నాయకులు దుబాసి వెంకటస్వామి, సీపీఐ నాయకులు దుప్పటి సాంబయ్య, పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు మంద కొర్నేలు తదితరులు పాల్గొన్నారు. ‌

Tags:    

Similar News