నా పెళ్లికి తొందరేం లేదు.. అతనితో రిలేషన్ బాగుంది : రకుల్

దిశ, సినిమా:  గ్లామర్‌‌, యాక్టింగ్‌ స్కిల్స్‌తో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్.. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌ జాకీ భగ్నానీతో కొన్నాళ్లుగా సీక్రెట్‌ రిలేషన్ మెయింటైన్ చేసిన భామ.. ఇటీవలే తన 31వ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేసింది. ఈ నేపథ్యంలో రకుల్ త్వరలోనే ఒంటరి జీవితానికి గుడ్‌బై చెప్పనుందని అంతా భావించారు. కానీ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన పంజాబీ బ్యూటీ, […]

Update: 2021-11-22 09:56 GMT

దిశ, సినిమా: గ్లామర్‌‌, యాక్టింగ్‌ స్కిల్స్‌తో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్.. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌ జాకీ భగ్నానీతో కొన్నాళ్లుగా సీక్రెట్‌ రిలేషన్ మెయింటైన్ చేసిన భామ.. ఇటీవలే తన 31వ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేసింది. ఈ నేపథ్యంలో రకుల్ త్వరలోనే ఒంటరి జీవితానికి గుడ్‌బై చెప్పనుందని అంతా భావించారు. కానీ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన పంజాబీ బ్యూటీ, పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తను హిందీలో నటించిన ‘థ్యాంక్స్‌ గాడ్‌’ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కగా.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న భామ తన కెరీర్‌, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

జాకీతో తన రిలేషన్‌‌ను మధురమైన అనుభూతిగా పేర్కొన్న రకుల్.. ఈ విషయం అందరితో షేర్‌ చేసుకుంటే బాగుంటుందని పబ్లిక్‌గా రివీల్ చేశానని తెలిపింది. అయితే అందరూ అనుకుంటున్నట్లు పెళ్లికి తొందరపడటం లేదని, ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్ చేసినట్లు చెప్పింది. సాధించాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయంటూ, మ్యారేజ్ టైమ్ వచ్చినపుడు అందరితో పంచుకుంటాను’ అని క్లారిటీ ఇచ్చింది.

చైతుతో డైవోర్స్ ఇష్యూ.. అన్నీ సరిగ్గా ఉంటే ఎందుకు కాకూడదు? : సమంత

Tags:    

Similar News