వెజిటేరియన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు : రకుల్

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్.. మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని చెబుతోంది. ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని.. ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని అభిమానులకు సూచిస్తోంది. కాగా ఈ ఏడాదే వెజిటేరియన్‌గా మారిన రకుల్.. ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. పంజాబీ ఫ్యామిలీకి చెందిన తనకు ఒకప్పుడు నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగకపోయేదన్న రకుల్.. నాన్ వెజ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసేదాన్నని తెలిపింది. అయితే అనుకోకుండా కూరగాయలు, ఆకు […]

Update: 2020-11-01 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్.. మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని చెబుతోంది. ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని.. ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని అభిమానులకు సూచిస్తోంది. కాగా ఈ ఏడాదే వెజిటేరియన్‌గా మారిన రకుల్.. ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.

పంజాబీ ఫ్యామిలీకి చెందిన తనకు ఒకప్పుడు నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగకపోయేదన్న రకుల్.. నాన్ వెజ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసేదాన్నని తెలిపింది. అయితే అనుకోకుండా కూరగాయలు, ఆకు కూరలు తరచుగా తీసుకోవడం మొదలుపెట్టానని, ఈ టైమ్‌లో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ లెవల్స్‌లో మంచి మార్పు కనిపించడంతో.. అదే కంటిన్యూ చేస్తున్నట్టు తెలిపింది.

వెజిటేరియన్‌గా మారాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, అది అకస్మాత్తుగా జరిగిపోయిందని చెప్పిన రకుల్.. నాన్ వెజ్ తినాలనే కోరిక ఇప్పుడు అస్సలు లేదని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఒక ప్రయోగంగా మొదలైన అలవాటు.. ప్రస్తుతం జీవనశైలిగా మారిపోయిందని వెల్లడించింది. పప్పు, బియ్యం, కూరగాయలు తిన్నా సరే, బరువు పెరగకపోగా.. తగ్గుతూ వచ్చానని తెలిపింది. కాగా రకుల్ ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.

Tags:    

Similar News