ప్రపంచానికి కనిపించు!.. భర్త కోసం ఏడ్చేసిన రాఖీ సావంత్
దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ అంటేనే ఎమోషనల్ రైడ్. ఇక ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యే వీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల తర్వాత డియర్ వన్స్‌ను కలిసిన కంటెస్టెంట్‌లు కన్నీరు పెట్టుకోవడం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో కంటెస్టెంట్‌గా ఉన్న ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కూడా కన్నీరు పెట్టుకుంది. అప్పటి వరకు సారీ కట్టుకునే టాస్క్‌లో సూపర్ ఫన్ అందించిన రాఖీకి సడెన్‌గా […]
దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ అంటేనే ఎమోషనల్ రైడ్. ఇక ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యే వీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల తర్వాత డియర్ వన్స్‌ను కలిసిన కంటెస్టెంట్‌లు కన్నీరు పెట్టుకోవడం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో కంటెస్టెంట్‌గా ఉన్న ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కూడా కన్నీరు పెట్టుకుంది. అప్పటి వరకు సారీ కట్టుకునే టాస్క్‌లో సూపర్ ఫన్ అందించిన రాఖీకి సడెన్‌గా తల్లిని వీడియో కాల్‌లో చూపించి ఎమోషనల్ చేశాడు బిగ్ బాస్. తల్లి హాస్పిటల్‌లో ఉందని తెలుసుకుని ఏడ్చేసిన హాట్ బాంబ్.. తను పూర్తిగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ బిగ్ బాస్ హౌజ్‌లో ఉపవాసం చేస్తానని తెలిపింది. ఇక ఇప్పటి వరకు ప్రపంచానికి కనిపించని తన భర్తను ఇప్పుడైనా బయటకు రమ్మనమని తల్లిని కోరుతూ ఎమోషనల్ అయిపోయింది.
కాగా 2018 నవంబర్‌లో టెలివిజన్ పర్సనాలిటీ దీపక్ కలాల్‌ను పెళ్లి చేసుకుంటానని రాఖీ సావంత్ ప్రకటించింది. కానీ 31 డిసెంబర్, 2018లో దీపక్ మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని, తనను మ్యారేజ్ చేసుకోనని స్పష్టం చేసింది. ఆ తర్వాత 2019 మిడిల్‌లో ఎన్‌ఆర్ఐ రితేశ్‌ను పెళ్లి చేసుకుంది రాఖీ. కానీ వీరిద్దరికి సంబంధించిన పెళ్లి ఫొటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు.