ఓటుహక్కు వినియోగించుకున్న జగన్, బాలయ్య
దిశ, ఏపీ బ్యూరో: కేకే, ఎంఏ ఖాన్, సుబ్బరామిరెడ్డి, సీతారామలక్ష్మి స్థానాల్లో ఖాళీ అయిన ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ బరిలో […]
దిశ, ఏపీ బ్యూరో: కేకే, ఎంఏ ఖాన్, సుబ్బరామిరెడ్డి, సీతారామలక్ష్మి స్థానాల్లో ఖాళీ అయిన ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ బరిలో నిలవగా, టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.
లంచ్ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు రిటర్నింగ్ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు. దీంతో రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. కాగా, రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు 38 మంది ప్రజాప్రతినిధుల మద్దతు అవసరం కాగా, వల్లభనేని వంశీ, కరణం బలరాం లాంటి తిరుగుబాటుదారులను ఇరుకున పెట్టేందుకు టీడీపీ విప్ జారీ చేసింది. దీంతో వీరు ఎవరికి ఓటేస్తారన్న విషయంలో ఆసక్తి నెలకొంది. కాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం లాంఛనమేనని తెలుస్తోంది.