ముగిసిన రాజ్యసభ పోలింగ్… వీరి విజయం లాంఛనమే

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై.. నాలుగు గంటలకు ముగిసింది. తొలుత వైఎస్సార్సీపీ నేతలు పోలింగ్‌లో పాల్గొనగా, మధ్యాహ్నం టీడీపీ నేతలు పోలింగ్‌కు హాజరయ్యారు. అరెస్టు కారణంగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు, సెల్ఫ్ క్వారంటైన్ నేపథ్యంలో అనగాని సత్యప్రసాద్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాసేపట్లో కౌంటింగ్ ఆరంభం కానుంది. […]

Update: 2020-06-19 05:51 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై.. నాలుగు గంటలకు ముగిసింది. తొలుత వైఎస్సార్సీపీ నేతలు పోలింగ్‌లో పాల్గొనగా, మధ్యాహ్నం టీడీపీ నేతలు పోలింగ్‌కు హాజరయ్యారు. అరెస్టు కారణంగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు, సెల్ఫ్ క్వారంటైన్ నేపథ్యంలో అనగాని సత్యప్రసాద్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాసేపట్లో కౌంటింగ్ ఆరంభం కానుంది. 6 గంటలకు అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, వైఎస్సార్సీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట్రమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ బరిలోఉన్నారు. వీరి విజయం లాంఛనమే. టీడీపీ తరపున వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News