రాజ్యసభ నిరవధిక వాయిదా..!
దిశ, వెబ్డెస్క్: రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల గడువును వారం రోజులు కుదించినట్లు పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. దీంతో బుధవారం రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే పలు కీలక బిల్లులకు సభ ఆమోదం లభించింది. రాజ్యసభ ఆమోదించిన బిల్లుల్లో ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్-2020, ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్-2020, […]
దిశ, వెబ్డెస్క్: రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల గడువును వారం రోజులు కుదించినట్లు పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. దీంతో బుధవారం రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే పలు కీలక బిల్లులకు సభ ఆమోదం లభించింది.
రాజ్యసభ ఆమోదించిన బిల్లుల్లో ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్-2020, ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్-2020, అండ్ ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ-2020 బిల్లులు, జమ్ముకశ్మీర్ అధికారిక భాషల బిల్లు-2020 ఉన్నాయి. అయితే అప్రాప్రియేషన్ (నెం.3) బిల్లు-2020, అప్రాప్రియేషన్ (నెం.4) బిల్లు-2020లను మాత్రం రాజ్యసభ వెనక్కు పంపింది.