పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం సిగ్గుచేటు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పోలీస్ శాఖలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు రోస్టర్ విధానం అమలు చేయటంలో అన్యాయానికి గురిచేయడం సరైంది కాదని గిరిజన లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ అన్నారు. గిరిజన అధికారులని చిన్న చూపుతో చూస్తూ ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఉద్దేశపూర్వకంగా గిరిజనులకు లూప్‌లైన్‌లో పోస్టింగ్ ఇస్తున్నారని.. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. పోలీసు శాఖ పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ నాయకుల జోక్యంతో […]

Update: 2020-07-25 08:49 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పోలీస్ శాఖలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు రోస్టర్ విధానం అమలు చేయటంలో అన్యాయానికి గురిచేయడం సరైంది కాదని గిరిజన లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ అన్నారు. గిరిజన అధికారులని చిన్న చూపుతో చూస్తూ ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఉద్దేశపూర్వకంగా గిరిజనులకు లూప్‌లైన్‌లో పోస్టింగ్ ఇస్తున్నారని.. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. పోలీసు శాఖ పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ నాయకుల జోక్యంతో కేటాయింపులు చేయటం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటన్నారు.

Tags:    

Similar News