T Congress: సబితకు జ్ఞానోదయం చేశారు.. మీరు వెళ్లండి.. తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్

లగచర్ల(Lagacharla) గ్రామస్థులు మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy)కి జ్ఞానోదయం చేశారని, కేటీఆర్, హరీష్ లు కూడా వెళ్లి రావాలని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ట్వీట్(Tweet) చేసింది.

Update: 2024-11-15 11:03 GMT
T Congress: సబితకు జ్ఞానోదయం చేశారు.. మీరు వెళ్లండి.. తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: లగచర్ల(Lagacharla) గ్రామస్థులు మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy)కి జ్ఞానోదయం చేశారని, కేటీఆర్, హరీష్ లు కూడా వెళ్లి రావాలని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ట్వీట్(Tweet) చేసింది. ఈ సందర్భంగా రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సబిత ఇంద్రారెడ్డితో గ్రామస్థులు మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్ నాయకుల(BRS Leaders)పై విమర్శలు(criticize) చేసింది. దీనిపై మీ వల్లే మా ఊరికి చెడ్డ పేరు వచ్చిందని, సురేష్ ఒక ఆవారా.. కొంతమంది తాగి వచ్చి దాడి చేశారని, ఆ దాడికి, రైతులకు ఎలాంటి సంబంధం లేదని గ్రామస్థులు చెబుతున్నారని తెలిపింది. అంతేగాక గ్రామస్తులు సబితకు జ్ఞానోదయం చేశారని, మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) కూడా వెళ్లి నాలుగు మొట్టికాయలు వేయించుకుని రండి అని సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా లగచర్ల ఘటనపై రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత సబిత ఇంద్రారెడ్డి వెళ్లారు.

Tags:    

Similar News