ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు.. సరుకులు పంచిన కాంగ్రెస్ నేతలు
దిశ, కరీంనగర్ సిటీ : దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రాజీవ్ చౌక్‌లో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నగర కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ దేనన్నారు. టెలీ […]
దిశ, కరీంనగర్ సిటీ : దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రాజీవ్ చౌక్‌లో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నగర కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ దేనన్నారు. టెలీ కమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు చేసిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని అన్నారు.
ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన అందించిన సేవలు.. సంస్కరణలు నేటికి దేశ పౌరులు సజీవంగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. దేశ ఐక్యత కోసం.. సమానత్వం కోసం.. సౌబ్రాతృత్వం కోసం కృషి చేసిన మహనీయుడని అన్నారు. సాంకేతిక విద్యా అభివృద్ధికి తోడ్పాటును అందించారన్నారు. దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టించిన పిదప, ఈ స్థాయిలో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే నాడు రాజీవ్ గాంధీ చేసిన కృషి ఫలితమేనన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వైద్యుల అంజన్ కుమార్, ఉప్పరి రవి, మాచర్ల ప్రసాద్, గుండాటి శ్రీనివాస రెడ్డి, ఎండి తాజ్, పడాల రాహుల్, గడ్డం విలాస్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, కొలిపాక సందీప్, సయ్యద్ ఖమ్రొద్దిన్, నిహాల్ అహ్మద్, లయిఖ్, చాంద్, ముక్క భాస్కర్, పోరండ్ల రమేష్, దన్ను సింగ్, నదిమ్, కుర్ర పోచయ్య, మేకల నరసయ్య, ఇమ్రాన్, కాంపల్లి కీర్తి కుమార్, బొబ్బిలి విక్టర్, మొసళ్ళ రాంరెడ్డి, విద్యాసాగర్ సలేముద్దిన్, దండి రవీందర్, లింగమూర్తి, షహేన్ష , కరీముద్దీన్, సుంకరీ గణపతి, దికొండ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.