పాలిటిక్స్‌పై రజనీకాంత్ బ్యాక్ స్టెప్

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ పార్టీపై రజనీకాంత్‌ బ్యాక్ స్టెప్ వేశారు. అనారోగ్యం కారణంగా పార్టీ పెట్టడం లేదంటూ మంగళవారం ఉదయం మూడు పేజీల లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం నా ఆరోగ్యం సహకరించడం లేదని, అందుకే పార్టీ ప్రకటన చేయడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాను కానీ.. ఇప్పుడు తాత్కాలికంగా రెస్ట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవ కొనసాగిస్తానని చెప్పిన రజనీ…నానిర్ణయం అభిమానులకు బాధ కలిగించొచ్చని, తనను క్షమించాలని కోరారు. కరోనా […]

Update: 2020-12-29 01:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ పార్టీపై రజనీకాంత్‌ బ్యాక్ స్టెప్ వేశారు. అనారోగ్యం కారణంగా పార్టీ పెట్టడం లేదంటూ మంగళవారం ఉదయం మూడు పేజీల లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం నా ఆరోగ్యం సహకరించడం లేదని, అందుకే పార్టీ ప్రకటన చేయడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాను కానీ.. ఇప్పుడు తాత్కాలికంగా రెస్ట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవ కొనసాగిస్తానని చెప్పిన రజనీ…నానిర్ణయం అభిమానులకు బాధ కలిగించొచ్చని, తనను క్షమించాలని కోరారు. కరోనా నెగిటివ్ వచ్చినా.. అధిక రక్తపోటుతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది మూడ్రోజుల క్రితం డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. ఈనెల 31న పార్టీ ప్రకటన చేస్తానని కొద్దిరోజుల క్రితమే రజనీకాంత్ స్పష్టం చేయగా ఇవాళ పార్టీ పెట్టడం లేదని లేఖను విడుదల చేశారు.

Tags:    

Similar News