రావయ్యా రజనీ! .. చెన్నైలో తలైవా అభిమానుల ధర్నా

దిశ, వెబ్‌డెస్క్ :  సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు చెన్నైలో ధర్నాకు దిగారు. అనారోగ్యం కారణంగా రాజకీయ పార్టీని ప్రకటించడం లేదన్న రజనీ పొలిటికల్ స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకోవాలంటూ నిరసన చేపట్టారు. రజనీ మక్కల్ మంద్రమ్ (ఆర్‌ఎంఎం) అగ్ర నాయకత్వం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ, తలైవర్ తాజా నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనాలని తంజావూరుకు చెందిన ఓ పార్టీ కార్యకర్త.. రజనీకాంత్ అభిమానులకు పిలుపునిచ్చారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా తరలివచ్చిన అభిమానులు, తలైవా తన […]

Update: 2021-01-10 03:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు చెన్నైలో ధర్నాకు దిగారు. అనారోగ్యం కారణంగా రాజకీయ పార్టీని ప్రకటించడం లేదన్న రజనీ పొలిటికల్ స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకోవాలంటూ నిరసన చేపట్టారు. రజనీ మక్కల్ మంద్రమ్ (ఆర్‌ఎంఎం) అగ్ర నాయకత్వం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ, తలైవర్ తాజా నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనాలని తంజావూరుకు చెందిన ఓ పార్టీ కార్యకర్త.. రజనీకాంత్ అభిమానులకు పిలుపునిచ్చారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా తరలివచ్చిన అభిమానులు, తలైవా తన స్టేట్‌మెంట్ వెనక్కి తీసుకోవాలని అభ్యర్థి్ంచారు. దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో తరలివచ్చి చేస్తున్న నిరసన ప్రదర్శనకు పోలీసులు కూడా అనుమతించారు.

కాగా జనవరి 2021లో పార్టీని లాంచ్ చేస్తాడనుకున్న రజనీకాంత్.. డిసెంబర్ 29న హెల్త్ ఇష్యూస్‌తో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటించాడు. ‘అన్నాత్తె’ షూటింగ్ సమయంలో అనారోగ్యానికి గురైన రజనీ, హాస్పిటల్‌లో చికిత్స పొందాక ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రానని.. పార్టీ స్థాపించబోనని తెలిపాడు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. తలైవా ఇంటి ఎదుట ఓ అభిమాని ఆత్మహత్యకు కూడా యత్నించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News