ఉత్కంఠ రేపుతున్న రాజస్థాన్ రాజకీయాలు

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే వ్యవహారంపై చర్చ నడుస్తోంది. బీజేపీ అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తతో రాజస్థాన్ సీఎల్పీ భేటీ నిర్వహించనున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో శాసనసభా పక్షం కాసేపట్లో సమావేశం కానుంది. అయితే, ఈ సమావేశానికి సచిన్ పైలట్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉన్నట్లు […]

Update: 2020-07-12 23:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే వ్యవహారంపై చర్చ నడుస్తోంది. బీజేపీ అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తతో రాజస్థాన్ సీఎల్పీ భేటీ నిర్వహించనున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో శాసనసభా పక్షం కాసేపట్లో సమావేశం కానుంది. అయితే, ఈ సమావేశానికి సచిన్ పైలట్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. వీటిని కాంగ్రెస్ మాత్రం కొట్టిపారేసింది. కేవలం 8 మంది అభ్యర్థులు మాత్రమే సచిన్ పైలట్‌కు మద్దతుఇస్తున్నారని చెప్పుకొస్తుంది. కాగా, ఈ రోజే సచిన్ పైలట్ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలుస్తారన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో రాజస్థాన్ రాజకీయాల్లో ఒక్కసారిగా సెగపుట్టింది.

Tags:    

Similar News