అక్కడ బీర్ చాలా చీప్ గురూ!
దిశ, వెబ్ డెస్క్: ఎవరు ఎట్లా అయినా పోనీ.. మందుబాబులకు మాత్రం మందు ఉంటే చాలు. ఎండాకాలంలో చిల్ అవ్వడానికి…పార్టీలో రచ్చ లేపడానికి … భాద మర్చిపోవడానికి ఇలా కారణం ఏదైనా అబ్బాయిలు బీర్ తాగడం మాత్రం కామన్. బీర్ రేట్ ఎంత పెరిగినా కూడా మందుబాబులు మాత్రం కొనడం ఆపరు. అయితే కరోనా కారణంగా దేశంలో మద్యం విక్రయాలు తగ్గాయి. దీంతో ప్రభుత్వం మందుబాబులకు ఒక శుభవార్తను తెలిపింది. ప్రభుత్వ ఖజానాకు భారీగా రెవెన్యూ తగ్గడంతో […]
దిశ, వెబ్ డెస్క్: ఎవరు ఎట్లా అయినా పోనీ.. మందుబాబులకు మాత్రం మందు ఉంటే చాలు. ఎండాకాలంలో చిల్ అవ్వడానికి…పార్టీలో రచ్చ లేపడానికి … భాద మర్చిపోవడానికి ఇలా కారణం ఏదైనా అబ్బాయిలు బీర్ తాగడం మాత్రం కామన్. బీర్ రేట్ ఎంత పెరిగినా కూడా మందుబాబులు మాత్రం కొనడం ఆపరు. అయితే కరోనా కారణంగా దేశంలో మద్యం విక్రయాలు తగ్గాయి. దీంతో ప్రభుత్వం మందుబాబులకు ఒక శుభవార్తను తెలిపింది.
ప్రభుత్వ ఖజానాకు భారీగా రెవెన్యూ తగ్గడంతో బీర్ల అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ పాలసీలో స్వల్ప మార్పులు తీసుకొచ్చింది. అవునా .. ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనా.. అంటే కాదు రాజస్థాన్ లో. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా రెవెన్యూ తగ్గిపోవడంతో రాజస్థాన్ ప్రభుత్వం ఒక్క బీర్ పై ఏకంగా రూ. 30 నుంచి రూ. 35 తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ కారణంగా మద్యం తాగడానికి మందుబాబులు ఆసక్తి చూపకపోవడం వలనే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.. బీర్ చౌక గా వస్తే మందుబాబులు పరిగెత్తుకుంటూ వస్తారని వారి ప్లాన్. ఇక దీంతో పాటు బాటిల్స్ ఎమ్మార్పీ ధరలపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్ ఛార్జీని తగ్గించారు.మరి ఈ విషయం తెలిసాక మందుబాబులు ఆగుతారా? లేదో చూడాలి.