శ్రీలంకలో 'రాజపక్స'దే విజయం
దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో రాజపక్స కుటుంబం విజయం కైవసం చేసుకోనుంది. మరోసారి మహిందా రాజపక్స శ్రీలంక ప్రధానిగా గెలవనున్నారు. రాజపక్స కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తోన్న శ్రీలంక పొదుజన పెరుమణ (ఎస్ ఎల్ పి పి) పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 16 సీట్ల ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి. వీటిలో 13 స్థానాల్లో ఎస్ ఎల్ పి పి 60 శాతం పైగా ఓట్లు దక్కిచుకుంది. తమిళులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో […]
దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో రాజపక్స కుటుంబం విజయం కైవసం చేసుకోనుంది. మరోసారి మహిందా రాజపక్స శ్రీలంక ప్రధానిగా గెలవనున్నారు. రాజపక్స కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తోన్న శ్రీలంక పొదుజన పెరుమణ (ఎస్ ఎల్ పి పి) పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 16 సీట్ల ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి. వీటిలో 13 స్థానాల్లో ఎస్ ఎల్ పి పి 60 శాతం పైగా ఓట్లు దక్కిచుకుంది.
తమిళులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎస్ ఎల్ పీ పీ అభ్యర్థులే విజయం దిశగా దూసుకుపోతున్నారు. మొత్తం 22 జిల్లాలకు గానూ 17 జిల్లాల్లో ఆధిక్యం సాధించినట్లు అనధికార ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 225 అసెంబ్లీ స్థానాల్లోనూ అత్యధిక స్థానాల్లో SLPP విజయం సాధిస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.