ఫీజులు పెంచేసి చదువును కాస్ట్ లీగా మార్చారు: విజయశాంతి
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని వర్సిటీల్లో కోర్సుల ఫీజులను అడ్డగోలుగా పెంచేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. నిరుపేదలకు విద్యను దూరం చేయాలని కుట్రపన్నారని ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. పీజీ, రెగ్యులర్, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ ఫీజులను డబుల్, ట్రిపుల్చేసి చదువును కాస్ట్లీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని టీచింగ్ పోస్టులు ఏళ్ల తరబడి […]
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని వర్సిటీల్లో కోర్సుల ఫీజులను అడ్డగోలుగా పెంచేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. నిరుపేదలకు విద్యను దూరం చేయాలని కుట్రపన్నారని ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. పీజీ, రెగ్యులర్, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ ఫీజులను డబుల్, ట్రిపుల్చేసి చదువును కాస్ట్లీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానీ రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని టీచింగ్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్న రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించకుండా రాష్ట్ర సర్కార్ చోద్యం చూస్తోందని ఫైరయ్యారు. వర్సిటీల్లోని ల్యాబ్‌లో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసేందుకు కూడా సౌకర్యాలు లేకపోవడంతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన చెందారు. వర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాల్సిన ప్రభుత్వం ఆ భారాన్ని స్టూడెంట్లపై మోపేందుకు ఫీజులు పెంచేందుకు జీవో 141 ను తీసుకొచ్చిందని విజయశాంతి దుయ్యబట్టారు. కేసీఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సకాలంలో చెల్లించడం లేదని, దీంతో విద్యార్థులపై తీవ్ర భారం పడుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 141 జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర రెవెన్యూ శాఖలో ఏండ్లుగా ఖాళీలున్నా రాష్ట్ర సర్కార్ భర్తీ చేయడం లేదని, ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. రెవెన్యూ శాఖకు గుండెకాయలాంటి సీసీఎల్ఏ పోస్టును ఏడేళ్లుగా ప్రభుత్వం ఖాళీగానే పెట్టిందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కూడా సీసీఎల్ఏ లేకుండానే చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సీసీఎల్ఏగా సీనియర్ ఐఏఎస్ రేమండ్ పీటర్‌ను నియమించిన ఏడాదిన్నర కాలం మాత్రమే కొనసాగించారని ఆమె వెల్లడించారు.