రెండ్రోజులుగా ఉత్తరాంధ్రలో వర్షాలు

దిశ, ఏపీ బ్యూరో: నిన్న మొన్నటి వరకు వేసవి తాపానికి గురైన ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. విశాఖపట్టణం, అరకు, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట, రాజాం, శ్రీకాకుళంలో వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని రైతాంగం వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రతో పాటు కోనసీమలోని పలు […]

Update: 2020-06-10 05:30 GMT

దిశ, ఏపీ బ్యూరో: నిన్న మొన్నటి వరకు వేసవి తాపానికి గురైన ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. విశాఖపట్టణం, అరకు, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట, రాజాం, శ్రీకాకుళంలో వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని రైతాంగం వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రతో పాటు కోనసీమలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.

Tags:    

Similar News