'సురేశ్ రైనాకు ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు'

దిశ, స్పోర్ట్స్: మిస్టర్ ఐపీఎల్ అని పేరున్న సురేశ్ రైనా ఈ మెగా లీగ్‌కు దూరం కానున్నాడా? వచ్చే ఏడాది జరిగే మెగా ఆక్షన్‌లో అతడిని ఎవరూ కొనుగోలు చేయరా? అంటే మాజీ క్రికెటర్లు డేల్ స్టెయిన్, సంజయ్ మంజ్రేకర్ అవుననే అంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సురేశ్ రైనాకు ఇదే ఆఖరి సీజన్ కావొచ్చని వారిద్దరూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన రైనా కేవలం 160 పరుగులు మాత్రమే […]

Update: 2021-10-02 10:30 GMT

దిశ, స్పోర్ట్స్: మిస్టర్ ఐపీఎల్ అని పేరున్న సురేశ్ రైనా ఈ మెగా లీగ్‌కు దూరం కానున్నాడా? వచ్చే ఏడాది జరిగే మెగా ఆక్షన్‌లో అతడిని ఎవరూ కొనుగోలు చేయరా? అంటే మాజీ క్రికెటర్లు డేల్ స్టెయిన్, సంజయ్ మంజ్రేకర్ అవుననే అంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సురేశ్ రైనాకు ఇదే ఆఖరి సీజన్ కావొచ్చని వారిద్దరూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన రైనా కేవలం 160 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక అర్ధ శతకం సాధించాడు. అదొక్కటే ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్. అసలు ఏ మాత్రం పరుగులు సాధించలేక సీఎస్కే బ్యాటింగ్ లైనప్‌కు భారంగా మారాడు. ‘ఐపీఎల్‌లో సురేశ్ రైనాకు ఇదే ఆఖరి సీజన్ అవుతుంది. గతంలో మాదిరిగా అతడు పరుగులు సాధించలేకపోతున్నాడు. ఐపీఎల్ వంటి లీగ్స్‌లో పరుగులు చేయకపోతే పక్కకు జరగాల్సిందే. ఇటీవల వార్నర్‌ను చూశాం.. త్వరలో రైనాకు కూడా అలాగే జరుగుతుంది’ అని స్టెయిన్ అన్నాడు. అయితే మంజ్రేకర్ మాట్లాడుతూ రైనాకు ఇంకా కొన్ని సీజన్లు ఆడే సత్తా ఉన్నది. కానీ, పరుగులు చేయకపోతే ఎవరు మాత్రం జట్టులోకి తీసుకుంటారని అన్నాడు.

Tags:    

Similar News