పట్టణంలో తూతూ మంత్రం

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయకపోవడం ద్వారా ఇండ్లలోకి వర్షపునీరు వెళ్తుంటే శాశ్వత పరిష్కారం చూపాల్సిన మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన పట్టణంలోని మెయిన్ రోడ్డులో పలు కిరాణ షాపులతో పాటు ప్రజల ఇళ్ళను సందర్శించారు. గత ఐదు రోజులుగా కురుస్తన్న భారీ వర్షాలకు పట్టణం మొత్తం వర్షపునీటీతో నిండిపోతుంటే అధికార పార్టీ […]

Update: 2020-08-15 03:05 GMT

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయకపోవడం ద్వారా ఇండ్లలోకి వర్షపునీరు వెళ్తుంటే శాశ్వత పరిష్కారం చూపాల్సిన మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన పట్టణంలోని మెయిన్ రోడ్డులో పలు కిరాణ షాపులతో పాటు ప్రజల ఇళ్ళను సందర్శించారు.

గత ఐదు రోజులుగా కురుస్తన్న భారీ వర్షాలకు పట్టణం మొత్తం వర్షపునీటీతో నిండిపోతుంటే అధికార పార్టీ పాలకవర్గం, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత ఏడాది డిసెంబర్ 8న మున్సిపాలిటీ అభివృద్దిపై, డ్రైనేజీ కాలువలోని పూడికతీతపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించి 9నెలలు గడస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు.

పట్టణ ప్రగతిలో తూతూ మంత్రంగా పనులు చేస్తూ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు ఫొటోలకు ఫోజులివ్వడంపై ఉన్న శ్రద్ధ పట్టణ సమస్యలపై లేదని ఎద్దేవా చేశారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి పట్టణం మొత్తం స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని.. లేనిపక్షంలో కాంగ్రెస్ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News