భాగ్యనగరంలో భారీ వర్షం
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కోఠి, ఉప్పల్, రాంనగర్, అంబర్ పేట, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేటతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు […]
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కోఠి, ఉప్పల్, రాంనగర్, అంబర్ పేట, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేటతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని.. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జీహఎచ్ఎంసీ కంట్రోల్ రూం(040-21111111)కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.