పారామెడికల్ సిబ్బంది నియామకానికి రైల్వే ఉద్యోగ ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని లాలాగూడ దక్షిణ మధ్య రైల్వే సెంట్రల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా నర్సింగ్ సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్స్, ఆస్పత్రి అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 15 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన, రైల్వే మాజీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని లాలాగూడ దక్షిణ మధ్య రైల్వే సెంట్రల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా నర్సింగ్ సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్స్, ఆస్పత్రి అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 15 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన, రైల్వే మాజీ ఉద్యోగులు, ఇతర సాధారణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో సేవలందించాల్సి ఉంటుందని, పోస్టులు, జీత భత్యాలు, అర్హతలు, వయస్సు, దరఖాస్తు వివరాలకు www.scr.indianrailways.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు. నియామకం అయిన వారు 2022 మార్చి 31 వరకు పనిచేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.