అధికారుల వేధింపులతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
దిశ, ఏపీ బ్యూరో: అధికారుల వేధింపులు తాళలేక ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. వివరాళ్లోకి వెళితే.. జిల్లాలోని రాయనపాడుకు చెందిన రాజు రైల్వేలో కీమెన్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో అధికారుల ఒత్తిడి పెరిగిందని.. సెల్ఫీ వీడియోలో పురుగుల మందు తాగుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న రాజును స్థానికులు గమనించి రైల్వే ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. […]
దిశ, ఏపీ బ్యూరో: అధికారుల వేధింపులు తాళలేక ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. వివరాళ్లోకి వెళితే.. జిల్లాలోని రాయనపాడుకు చెందిన రాజు రైల్వేలో కీమెన్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో అధికారుల ఒత్తిడి పెరిగిందని.. సెల్ఫీ వీడియోలో పురుగుల మందు తాగుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న రాజును స్థానికులు గమనించి రైల్వే ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.