కోహ్లీకి రాహుల్ గాంధీ మద్దతు

దిశ, వెబ్ డెస్క్: పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైన సందర్భంగా సహచర ఆటగాడు మహమ్మద్ షమీకి మద్దతుగా మాట్లాడినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి  9 నెలల వామికతో సహా కోహ్లీ భార్య అనుష్క శర్మపై కూడా అసభ్యకర కామెంట్లు, బెదిరింపులు వచ్చాయి.  ఈ క్రమంలో కోహ్లీకి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అండగా నిలిచారు. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారంటూ ఆయన మంగళవారం సాయంత్రం ఓ ట్వీట్‌ చేశారు. ‘ప్రియమైన విరాట్‌ కోహ్లీ.. […]

Update: 2021-11-03 06:49 GMT
దిశ, వెబ్ డెస్క్: పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైన సందర్భంగా సహచర ఆటగాడు మహమ్మద్ షమీకి మద్దతుగా మాట్లాడినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 9 నెలల వామికతో సహా కోహ్లీ భార్య అనుష్క శర్మపై కూడా అసభ్యకర కామెంట్లు, బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీకి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అండగా నిలిచారు. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారంటూ ఆయన మంగళవారం సాయంత్రం ఓ ట్వీట్‌ చేశారు. ‘ప్రియమైన విరాట్‌ కోహ్లీ.. ఈ వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారు. ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించండి.. భారత జట్టును రక్షించండి’ అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.
Tags:    

Similar News