గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులపై రాహుల్ సానుభూతి
కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు భారీ సంఖ్యలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నెల రోజులుగా చిక్కుకుపోవడంతో వారంతా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర అనారోగ్యం పాలై కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తినేందుకు తిండి కూడా దొరకట్లేదని తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, 6,000 మంది ఏపీకి చెందిన మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారన్నారు. నెల రోజులుగా వారు […]
కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు భారీ సంఖ్యలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నెల రోజులుగా చిక్కుకుపోవడంతో వారంతా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర అనారోగ్యం పాలై కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తినేందుకు తిండి కూడా దొరకట్లేదని తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, 6,000 మంది ఏపీకి చెందిన మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారన్నారు. నెల రోజులుగా వారు తమ చిన్నపాటి పడవల్లోనే ఉంటూ సరిగ్గా తిండి, నీళ్లు కూడా లేక అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ వసతి గృహాల్లోకి తరలించాలని, వారికి సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. చాలా మంది అనారోగ్యానిక గురయ్యారన, వారికి సరైన వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు.
కాగా, తామందరం చనిపోతామనే భయంతో బతుకుతున్నామని అక్కడి మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారంతా సురక్షితంగా ఉంటారన భరోసా ఇచ్చినట్టు తెలిపారు. అయితే జాతీయ మీడియా కథనంతో వారి సంరక్షణ గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది.
Tags: ap, gujarat, fishermen, lockdown, rahul gandhi, congress, twitter