‘ఖేతీ బచావో’ యాత్ర ప్రారంభం

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పంజాబ్ నుంచి ‘ఖేతీ బచావో’ పేరిట యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ మోగా జిల్లా బధ్ని కల్నాన్ నుంచి సీఎం అమరీందర్‌ సింగ్‌తో కలిసి యాత్రను చేపట్టారు. 50కిలోమీటర్ల మేర యాత్ర సాగిన అనంతరం జత్‌పురాలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించనున్నారు. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ఖేతీ బచావో యాత్ర మూడురోజుల పాటు సాగనుంది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ […]

Update: 2020-10-04 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పంజాబ్ నుంచి ‘ఖేతీ బచావో’ పేరిట యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ మోగా జిల్లా బధ్ని కల్నాన్ నుంచి సీఎం అమరీందర్‌ సింగ్‌తో కలిసి యాత్రను చేపట్టారు. 50కిలోమీటర్ల మేర యాత్ర సాగిన అనంతరం జత్‌పురాలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించనున్నారు. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ఖేతీ బచావో యాత్ర మూడురోజుల పాటు సాగనుంది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News