రేపో మాపో హస్తినకు నరసాపురం ఎంపీ?
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హస్తినకు వెళ్లనున్నట్లు సమాచారం. గత రెండు వారాలుగా పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలతో ఆందోళన చెందిన రఘురామకృష్ణం రాజు.. తన ప్రాణాలకు హాని ఉందని, రాష్ట్ర ప్రభుత్వ భద్రతపై నమ్మకం లేదని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ నెల […]
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హస్తినకు వెళ్లనున్నట్లు సమాచారం. గత రెండు వారాలుగా పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలతో ఆందోళన చెందిన రఘురామకృష్ణం రాజు.. తన ప్రాణాలకు హాని ఉందని, రాష్ట్ర ప్రభుత్వ భద్రతపై నమ్మకం లేదని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఢిల్లీ వెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. హస్తినలో హోం మంత్రి అమిత్ షా, స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై వివాద పరిస్థితులను వివరించనున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉధృతి పెరిగితే ప్రయాణం వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎంపీ సిబ్బంది చెబుతున్నారు.