జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణ
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తను కూడబెట్టిన డబ్బులతో ప్రధాని కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన నమ్మిన ఏసుక్రీస్తు కూడా జగన్ కోరికను అంగీకరించరని విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా కరాళనృత్యం చేస్తుంటే.. అవేమీ పట్టించుకోకుండా కరోనాపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. జగన్ నిర్లక్ష్యం వల్లే బాధితులకు తీరని అన్యాయం జరుగుతుందని, ముందు జగన్‌పై కేసులు పెట్టాలన్నారు. అంతేకాకుండా మృతుల […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తను కూడబెట్టిన డబ్బులతో ప్రధాని కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన నమ్మిన ఏసుక్రీస్తు కూడా జగన్ కోరికను అంగీకరించరని విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా కరాళనృత్యం చేస్తుంటే.. అవేమీ పట్టించుకోకుండా కరోనాపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. జగన్ నిర్లక్ష్యం వల్లే బాధితులకు తీరని అన్యాయం జరుగుతుందని, ముందు జగన్‌పై కేసులు పెట్టాలన్నారు. అంతేకాకుండా మృతుల కుటంబాలకు రూ.10లక్షలు ఇస్తామన్న జగన్ ప్రకటనపై మండిపడ్డారు. డబ్బులు ఏమైనా జగన్ జేబులోంచి ఇస్తాడా..? అని ప్రశ్నించారు.