సీఎం జగన్‌కి షాకిచ్చిన రఘురామకృష్ణంరాజు.. ఏకంగా అక్కడ ఫిర్యాదు
దిశ, ఏపీ బ్యూరో: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం జగన్‌తోపాటు పలువురు అధికారులపై ఫిర్యాదు చేశారు. సీఎం జగన్, తనపై దాడి చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. అలాగే వైసీపీ అధికారిక వెబ్‌సైట్ నుంచి తన పేరును తొలగించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. 48 గంటల్లో తన పేరును వెబ్‌సైట్‌లో చేర్చకపోతే.. మరోసారి కలిసేందుకు […]
దిశ, ఏపీ బ్యూరో: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం జగన్‌తోపాటు పలువురు అధికారులపై ఫిర్యాదు చేశారు. సీఎం జగన్, తనపై దాడి చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. అలాగే వైసీపీ అధికారిక వెబ్‌సైట్ నుంచి తన పేరును తొలగించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. 48 గంటల్లో తన పేరును వెబ్‌సైట్‌లో చేర్చకపోతే.. మరోసారి కలిసేందుకు స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరారు.
మరోవైపు రాష్ట్రంలో తన దిష్టిబొమ్మలను అధికార పార్టీ నేతలు తగులబెడుతున్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ 48 గంటల్లోగా తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించాలని పార్లమెంటు సెక్రటేరియట్‌ను కోరతానని అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే.