ఆర్ఆర్ఆర్ నోట అమరావతి మాట
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీపై హాట్ కామెంట్స్ చేస్తూ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఇప్పటివరకు షోకాజ్ నోటీసులు, ఎంపీ, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసిన ఆయన తాజాగా అమరావతి వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మంచి రాజధాని అమరావతే అవుతుందన్నారు. రాజధాని వికేంద్రీకరణ సమంజసం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, అమరావతిని మూడు ముక్కలు చేయడం అన్యాయమన్నారు. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు […]
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీపై హాట్ కామెంట్స్ చేస్తూ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఇప్పటివరకు షోకాజ్ నోటీసులు, ఎంపీ, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసిన ఆయన తాజాగా అమరావతి వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మంచి రాజధాని అమరావతే అవుతుందన్నారు. రాజధాని వికేంద్రీకరణ సమంజసం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, అమరావతిని మూడు ముక్కలు చేయడం అన్యాయమన్నారు. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వైసీపీ నెరవేర్చాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ప్రజల ఆలోచన మేరకే ప్రభుత్వం నడుచుకోవాలని ఆయన సూచించారు.